US Open 2024: యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌లో అతి పెద్ద సంచలనం.. రెండో రౌండ్‌లోనే ఓడిన అల్కరాజ్

US Open 2024: యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌లో అతి పెద్ద సంచలనం.. రెండో రౌండ్‌లోనే ఓడిన అల్కరాజ్

యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌లో సంచలన ఫలితం నమోదయింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ విజేత.. ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్ లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం (ఆగస్టు 29) జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ  74 వ ర్యాంకర్ నెదర్లాండ్స్‌ ప్లేయర్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌ 6-1, 7-5, 6-4 తేడాతో అల్కరాజ్ ను మట్టి కరిపించాడు. దీంతో వరుసగా 15 గ్రాండ్ స్లామ్ విజయాలకు బ్రేక్ పడింది. 

ఈ ఓటమితో అల్కరాజ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే ఆశలకు తెరపడింది. మరోవైపు జాండ్‌స్చుల్ప్ తన కెరీర్ లో అతిపెద్ద విజయం సాధించాడు. వరుస సెట్లలో అల్కరాజ్ ను ఓడించడం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. గత మూడేళ్ళుగా స్పెయిన్ వీరుడు టెన్నిస్ లో దూసుకెళ్తున్నారు. 2022 లో యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌ గెలిచి తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకున్నాడు. 

Also Read:-అంతర్జాతీయ క్రికెట్‌కు భారత ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌.. 25వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌ వేటలో మరో అడుగు ముందుకేశాడు. యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌రెండో రౌండ్‌లో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌ 6–4, 6–4, 2–0తో లాస్లో డిజెరె (సెర్బియా)పై గెలిచాడు. దీంతో యూఎస్‌‌‌‌‌ ఓపెన్‌‌లో 90వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న జొకో.. నాలుగు గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌లోనూ ఇన్నే  విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.

ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌(జర్మనీ) 6–4, 7–6 (7/5), 6–1తో అలెగ్జాండర్‌‌‌‌‌‌ ముల్లర్‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై, ఆరో సీడ్‌‌‌‌‌‌‌‌ రబ్లెవ్‌ (రష్యా) 4–6, 5–7, 6–1, 6–2, 6–2తో రిండర్‌‌‌‌‌‌‌‌ కెంచ్‌‌‌‌‌‌‌‌(ఫ్రాన్స్‌‌‌‌)పై, 8వ సీడ్‌ కాస్పర్‌‌‌‌‌‌‌‌‌ రుడ్‌‌‌‌‌‌‌(నార్వే) 6–4, 6–2, 2–6, 7–6 (7/3)తో  గేల్‌‌‌‌‌‌‌‌మోన్‌‌‌‌‌‌‌‌‌ఫిల్స్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌)పై, 9వ సీడ్‌‌‌‌‌ దిమిత్రోవ్‌‌‌‌‌‌‌ (రష్యా) 6–1, 6–1, 7–6 (7/4)తో హిజికటా (ఆస్ట్రేలియా)పై, 12వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌‌ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–3, 7–6 (7/1), 6–1తో బెరెటినీ (ఇటలీ)పై, 13వ సీడ్‌‌‌‌‌ షెల్టన్‌‌‌‌‌‌(అమెరికా) 6–3, 6–4, 6–4తో బటిస్టా అగుట్‌‌‌‌‌‌(స్పెయిన్‌‌‌‌‌‌‌)పై, 20వ సీడ్‌‌‌‌‌ ఫ్రాన్సెస్‌‌‌‌‌‌ తియాఫో (అమెరికా) 6–4, 6–1, 1–0తో అలెగ్జాండర్‌‌‌‌‌‌ షివ్‌‌‌‌‌‌‌‌‌ చెంకో (కజకిస్తాన్‌‌‌‌‌)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.