Monte Carlo Masters: క్లే కోర్ట్ పై మరో స్పెయిన్ వీరుడు.. అల్కరాజ్‌కే మోంటే కార్లో మాస్టర్స్

Monte Carlo Masters: క్లే కోర్ట్ పై మరో స్పెయిన్ వీరుడు.. అల్కరాజ్‌కే మోంటే కార్లో మాస్టర్స్

స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ మోంటే కార్లో మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో ఇటాలియన్ ఆటగాడు లోరెంజో ముసెట్టిపై 3-6, 6-1, 6-0 తేడాతో విజయం సాధించాడు. అల్కరాజ్ కు ఇదే తొలి మోంటే కార్లో మాస్టర్స్ టైటిల్ కాగా.. ఓవరాల్ గా ఆరో మాస్టర్స్ 1000 సింగిల్స్ టైటిల్. తొలి సెట్ లో ఓడిపోయినా.. తర్వాత రెండో సెట్ లలో  అద్భుతంగా  పుంజుకొని ఫైనల్ గెలవడం విశేషం. తొలి సెట్ ను 3-6 తేడాతో కోల్పోయిన అల్కరాజ్‌.. చివరి రెండు సెట్లలో ఒక గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. 

నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన ఈ 21 ఏళ్ల స్పానియార్డ్‌కు 2024 వింబుల్డన్ గెలిచిన తర్వాత ఇదే ప్రతిష్టాత్మకమైన టైటిల్. మ్యాచ్ గెలిచిన తర్వాత అలంకారాజ్ మాట్లాడుతూ.. "మొదటిసారి మోంటే కార్లో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి పడిన కష్టానికి ఫలితం దక్కింది". అని ఈ స్పెయిన్ స్టార్ తెలిపాడు. మరోవైపు టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన లోరెంజో ముసెట్టి ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో స్టెఫానోస్ సిట్సిపాస్.. సెమీస్ లో అలెక్స్ డి మినౌర్‌లకు షాకిచ్చిన ముసెట్టి.. ఫైనల్లో తొలి సెట్ గెలిచిన తర్వాత పూర్తిగా చేతులెత్తేశాడు.