న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ కార్లైల్ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 5 శాతం వాటాను అమ్మాలని ప్లాన్ చేస్తోంది. ఒక్కో షేరుని రూ.750– రూ. 760 రేంజ్‌లో అమ్మి, రూ.1,000 కోట్లు సేకరించాలని చూస్తోందని సీన్‌బీసీ అవాజ్ రిపోర్ట్ చేసింది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు సోమవారం సెషన్‌లో రూ.794 దగ్గర క్లోజయ్యాయి.
ఈ ధరతో పోలిస్తే కార్లైల్ ఆఫర్ చేస్తున్న అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర 4.5 శాతం తక్కువ. బ్లాక్ డీల్స్ ద్వారా ఈ సేల్ జరగనుండగా, ఐఐఎఫ్‌ఎల్ ఈ డీల్స్‌కు బ్రోకర్‌గా పనిచేస్తుంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 1.14 శాతం మాత్రమే పెరిగాయి. గత ఏడాది కాలంలో 25 శాతం రిటర్న్ ఇచ్చాయి.