కరోనాతో నార్త్ కొరియా కకావికలం

కరోనాతో నార్త్ కొరియా కకావికలం

కరోనాతో నార్త్ కొరియా కకావికలం అవుతోంది. ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదవుతుండగా..ఒకేసారి టెస్టులు చేసే అవకాశం లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే కరోనాగా భావిస్తున్నారు. దీంతో సోమవారం ఒక్కరోజే 2 లక్షల 69 వేల 510 మంది తీవ్ర జ్వరంతో బాధపుడతున్నట్లు తెలిపింది నార్త్ కొరియా మీడియా. ఇక జ్వరం వల్ల ఆరుగురు చనిపోయినట్లు చెప్పింది.

నార్త్ కొరియాలో ఏప్రిల్ చివరి వారం నుంచి కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు 10 లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదవగా 56 మంది చనిపోయినట్లు నార్త్ కొరియా యాంటీ వైరస్ హెడ్ క్వార్టర్స్ తెలిపింది. అయితే మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఎంత మందికి కొవిడ్ పాజిటివ్ అనేది స్పష్టంగా చెప్పలేదు కిమ్ ప్రభుత్వం. నార్త్ కొరియాలో దాదాపు అందరికీ కొవిడ్ సోకి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. బాధితుల్లో ఇప్పటివరకు సగం మంది కోలుకోగా..ఇంకా 6 లక్షల 63 వేల మంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

భారీ ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం నార్త్ కొరియాకు లేకపోవడంతో..ఎంత మందికి కరోనా సోకిందనే విషయంపై స్పష్టత రావట్లేదు. దీంతో కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి షెల్టర్లలో ఐసోలేషన్ లో ఉంచారు. మరోవైపు.. నార్త్ కొరియాలో ఎవరూ వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఆరోగ్య వ్యవస్థ కూడా అంతంమాత్రంగానే ఉండటంతో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . 

వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన వ్యూహం అమలు చేయాలని అధికారులకు సూచించారు నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. మెడిసిన్ పంపిణీకి సైన్యాన్ని రంగంలోకి దించారు. జ్వరంతో ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్ కు పంపేందుకు ఆరోగ్య అధికారులు, టీచర్లు, మెడికల్ స్టూడెంట్లను ఇంటింటికీ పంపుతున్నారు. అయితే వ్యాక్సిన్లు తీసుకోవడంపై కిమ్ నుంచి ఎలాంటి ప్రకటన గానీ.. అభ్యర్థనలు గానీ రాలేదు.

 

మరిన్ని వార్తల కోసం

జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన

మహేశ్ డ్యాన్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్