వీడు మామూలోడు కాదు.. 26 కార్లు అద్దెకు తీసుకుని అమ్మేశాడు

వీడు మామూలోడు కాదు.. 26 కార్లు అద్దెకు తీసుకుని అమ్మేశాడు

మీరు కార్లను రెంట్ కు ఇస్తున్నారా.? అయితే జాగ్రత్త. ఈ హైదరాబాద్ మహానగరంలో  కొందరు కేటుగాళ్లు అద్దె పేరుతో కార్లను తీసుకెళ్లి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. జల్సా చేస్తున్నారు.  లేటెస్ట్ గా ఇలాంటి ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ లో జరిగింది.  సెల్ఫ్ డ్రైవ్ పేరుతో కార్లు ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏకంగా 26 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి  కేసు వివరాలను వివరించారు.  విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని చెప్పారు. జగద్గిరి గుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. అతని దగ్గర 2కోట్ల 50లక్షల విలువ గల 26కార్లను స్వాదీనం చేసుకున్నారని తెలిపారు. ఫణీంద్రను రిమాండ్ కు తరలించారు. ఫణింద్రతో పాటు మరో ముగ్గురు అద్దెకు తీసుకున్న కార్ల అమ్మకాల్లో నిందుతులుగా ఉన్నారు .  ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని డీసీపీ సురేష్ తెలిపారు. 

Also Read :- 299 రూపాయల క్రెడిట్ కార్డు బకాయి.. 22లక్షల డిమాండ్ నోటీసు

ఎందుకైనా మంచిది కార్లను రెంట్ కు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అద్దెకు తీసుకుంటున్న వ్యక్తి ఎవరు..ఏంటి అని పూర్తి వివరాలు సరిగా ఉన్నాయో లేదో  చూసుకుని అద్దెకు ఇవ్వండి. తొందరపడి అద్దెకు ఇచ్చి మోసపోకండి అని పోలీసులు సూచిస్తున్నారు.