ఆరు అడుగుల ఇసుకలో ఇరుక్కున్న కార్లు, బైకులు, ట్రాక్టర్లు

ఆరు అడుగుల ఇసుకలో ఇరుక్కున్న కార్లు, బైకులు, ట్రాక్టర్లు

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాని వర్షం ముంచెత్తింది. ఎడతెరపిలేని వానలతో జిల్లా ప్రజలు కకావికలం అయ్యారు. నాయకన్ గూడెంలో జల విలయానికి భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది. భారీ వాహానాలైన జేసిబిలు, డోజర్ బ్లేడ్లు, ట్రాక్టర్లు, బైకులు, కార్లు కాగితాల్లాగా ఎగిరి వచ్చి 6 అడుగుల ఇసుకలో కూరుకు పోయాయి. కూరుకుపోయిన వాహనాలను బయటకు తీసే వీలు లేకుండా పరిస్థితి ఉంది. 

చుట్టూ పేరుకు పోయిన ఇసుక, మట్టి తొలగిస్తే తప్ప .. ఆ వాహనాలు బయటికి రావు. నాయకన్ గూడెంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఆనవాళ్లు లేకుండా కొట్టుకొని పోయింది. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురిలో ఒకరి మృత దేహం లభ్యమయ్యింది. ఒకరు ప్రాణాలతో బయట పడ్డారు. మహిళ మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు రెస్క్యూ టీంలు.