
పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి.మంగళవారం (ఏప్రిల్8) బెంగాల్లోని ముర్షిదాబాద్ లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పెత్త ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి రావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వాలి. పోలీసు వెహికల్స్ తోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు.
బెంగాల్ చెలరేగిన ఉద్రికత్తలపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ అల్లర్లకు మమత ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముర్షిదాబాద్ వీధుల్లో ఆందోలన కారులు బీభత్సం సృష్టించారు వారిని అడ్డుకునేకుందుకు బెంగాల్ పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. మమతా ఉద్వేగ పూరిత ప్రసంగాలే ఇందుకు కారణమని బెంగాల్ బీజేపీ నేత అమిత్ మాలవియా అన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం 2025 మంగళవారం (ఏప్రిల్8) నుంచి అమలోకి వచ్చింది. పార్లమెంట్లు ఈ వక్ఫ్ సవరణ బిల్లు సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదం పొందింది. శనివారం నాడు రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడంతో వక్ఫ్ సవరణ చట్టం 2025 గా మారింది. మమత చర్యలతో పశ్చిమ బెంగాల్ ను మరో బంగ్లాదేశ్ గా మారుస్తుందని ఆరోపించారు.