దూసుకుపోతున్న కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌24 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దూసుకుపోతున్న కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌24 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన కార్స్24  ఒక్క హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రూ.497 కోట్ల లోన్లను ఇచ్చామని ప్రకటించింది. దేశం మొత్తం మీద సుమారు రూ.2 వేల కోట్ల లోన్లను డిస్ట్రిబ్యూట్ చేశామని పేర్కొంది. ప్రస్తుతానికి తాము అమ్ముతున్న సెకెండ్ హ్యాండ్ కార్లకు కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌24 ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లోన్లను ఇస్తోంది. కనీసం 15 శాతం వడ్డీకి ఫైనాన్స్ ఇస్తున్నామని, కస్టమర్ల క్రెడిట్ స్కోర్ బట్టి ఇందులో తేడా ఉంటుందని కంపెనీ ఫౌండర్ గజేంద్ర జంగిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.

టికెట్ సైజ్ సగటున రూ.6 లక్షలు ఉందని పేర్కొన్నారు. సగటున 63 నెలలకు నెలకు రూ.11,500 ఈఎంఐ ఉండేలా లోన్లను ఇస్తున్నామని వెల్లడించారు.  హ్యుండాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐ20, గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐ10, మారుతి సుజుకీ బాలెనో వంటి హ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు గిరాకీ ఉందని, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.