వరంగల్‌‌‌‌‌‌‌‌లో కార్స్​24 నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ స్టోర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు:  యూజ్డ్ కార్స్​ సెల్లర్​ కార్స్​24, వరంగల్‌‌‌‌‌‌‌‌లో తమ కొత్త 'కార్స్​24 నెట్‌‌‌‌‌‌‌‌వర్క్' స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. నగరంలో కార్స్​24కి  ప్రాంతీయ భాగస్వామిగా పనిచేస్తున్న యువిన్ ఆటోస్‌‌‌‌‌‌‌‌తో కలిసి దీనిని ప్రారంభించింది.  కారు కొనుగోలు విధానం ఆన్​లైన్​ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమవుతుంది. కారు యజమానులకు నిమిషాల్లో వారి వాహనం విలువను తెలియజేస్తారు. డబ్బు వారి బ్యాంక్ ఖాతాలకు వేగంగా బదిలీ అవుతుంది. కార్ల అమ్మకంలో ఒత్తిడిని తొలగించి, సులభంగా, స్పష్టంగా,  త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయటమే తమ లక్ష్యమని సంస్థ తెలిపింది.