జగిత్యాలలో పోలీసుల కార్టన్​సెర్చ్​

జగిత్యాలలో పోలీసులు కార్టన్ సెర్చ్​ నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుడుంబా ప్యాకెట్లతో పాటు పలు వాహనాలను సీజ్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని నక్కల గుట్ట ప్రాంతంలో గుడుంబా అమ్ముతున్నారన్న సమాచారం అందటంతో ఆగస్టు 26 ఉదయాన్నే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. 

ALSO READ : లెప్రసీ సర్వే కోసం వెళ్లిన... ఆశ కార్యకర్తకు గుండెపోటు

పబ్లిక్​ఇచ్చిన క్లూస్​తో గుడుంబా అమ్ముతున్న ఇళ్లను గుర్తించారు. ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్​ చేశారు. సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 2 ట్రాక్టర్లు, 73 ద్విచక్రవాహనాలను సీజ్​ చేశారు. అనంతరం పబ్లిక్​కి అవెర్​నెస్​కల్పించారు.