అఖిలప్రియ తమ్ముడిపై కేసు.. ఎఫ్ఐఆర్‌‌లో చేర్చిన పోలీసులు

అఖిలప్రియ తమ్ముడిపై కేసు.. ఎఫ్ఐఆర్‌‌లో చేర్చిన పోలీసులు

కిడ్నాప్ కేసులో నిందితుడిగా జగత్‌‌విఖ్యాత్‌‌ రెడ్డి

అఖిలప్రియ పోలీసు కస్టడీ పూర్తి.. జైలుకు తరలింపు   

హైదరాబాద్‌‌, వెలుగు: రియల్టర్ ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు భార్గవరామ్, అతని సోదరుడు చంద్రహాస్ పారిపోయేందుకు సహాయం చేశారంటూ వాళ్ల పేరెంట్స్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. భూమా అఖిలప్రియ తమ్ముడు జగత్‌‌విఖ్యాత్‌‌ రెడ్డిని కూడా మరో నిందితుడిగా నమోదు చేశారు. డ్రైవర్‌‌‌‌ దుర్గా ఇచ్చిన సమాచారంతో కిడ్నాప్‌‌ జరిగిన రోజు భార్గవరామ్‌‌తో కలిసి జగత్‌‌విఖ్యాత్‌‌ కూడా బాధితుల ఇంటి వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అఖిల ప్రియకు మూడు రోజుల పోలీసు కస్టడీ గురువారం ముగిసింది. ఆమెకు గాంధీ హాస్పిటల్ లో మెడికల్ టెస్టులు చేయించిన పోలీసులు ఆ తర్వాత మారేడ్ పల్లి జడ్జెస్ క్వార్టర్స్ లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. జడ్జి ఆదేశాల మేరకు చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కిడ్నాప్‌‌ ప్లాన్‌‌లో మొత్తం 25 మందికి పైగా నిందితులను గుర్తించారు. మరో రెండు రోజుల్లో అందరి వివరాలను వెల్లడించనున్నారు. ఇంకా పలువురు కీలక నిందితులు పరారీలో ఉన్నారని, వీరి కోసం 8 టీమ్స్ తో
గాలిస్తున్నారు.

For More News..

వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

నేడు 4,200 మందికి వ్యాక్సిన్.. వారంలో నాలుగు రోజులు మాత్రమే వ్యాక్సినేషన్

వరస్ట్​ సీఎంలలో కేసీఆర్‌కు 4వ ప్లేస్‌