- జేటీసీ రమేశ్‌కుమార్‌పై దాడి చేసినందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు : ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసులో గురువారం ఆర్టీఏ జాయింట్ కమిషనర్రమేశ్కుమార్పై దాడిచేసిన ఆటో యూనియన్నాయకుడు అమానుల్లాఖాన్‌పై కేసు నమోదు చేసినట్లు రవాణాశాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్‌జ్యోతి తెలిపారు. ఖైరతాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్కస్టడీ విధించిందన్నారు. దాడి జరిగిన వెంటనే తాము రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సమాచారం ఇచ్చామని, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని వివరించారు.
కాగా జేటీసీ రమేశ్ పై జరిగిన దాడిని తెలంగాణ గ్రూప్–1 ఆఫీసర్స్అసోసియేషన్, తెలంగాణ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎన్జీవోస్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ఎంప్లాయిస్ అసోసియేషన్, కానిస్టేబుల్స్అసోసియేషన్ ఖండించాయి. దాడిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లోని అధికారులు, సిబ్బంది పెన్డౌన్చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
నిరసనలు విరమించాలి : ట్రాన్స్ పోర్టు సంఘం
జేటీసీ రమేశ్ కుమార్ పై జరిగిన దాడిని ఆ శాఖకు సంబంధించిన వివిధ యూనియన్ల నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ట్రాన్స్ పోర్ట్ యూనియన్ నాయకులు పి.రవీందర్ గౌడ్, ఎస్ఎం హుస్సేనీ, సత్యనారాయణ, కృష్ణ యాదవ్, అరుణేందర్ ప్రసాద్, ప్రదీప్ రామకృష్ణ , ఎంజులారెడ్డి, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ నిరసన తెలిపారు. జేటీసీపై దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని
సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్ పోర్టు ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులు నిరసనలను విరమించి విధులకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.