
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ నిన్న వరంగల్ లోని కాకతీయ కళాతోరణం లోపలికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. రాష్ట్ర లోగో మార్పుకు వ్యతిరేకంగా కాకతీయ కళాతోరణం దగ్గర బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేటర్లు ధర్నా చేశారు. అనుమతులు లేకుండా లోపటికి వెళ్లడంతో సెక్షన్ 143 ప్రకారం ఏడుగురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.