హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఓటర్లకు దావత్ ఇచ్చిన బీఆర్ఎస్ లీడర్లపై గురువారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్లబ్‌లో బుధవారం రాత్రి కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఓటర్లను ప్రభావితం చేసేందుకు విందు ఇచ్చినట్లు సమాచారం అందడంతో ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని విచారించింది.
ఈ ఘటనలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, వర్ధినేని రవీందర్‌రావులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.