
బెల్లంపల్లి రూరల్, వెలుగు : పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై శ్యాం పటేల్ తెలిపారు. చిన్నయ్య గురువారం తన సొంత గ్రామమైన జెండావెంకటాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని పోలింగ్కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు.
దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పందించిన ప్రిసైడింగ్ఆఫీసర్ ఒజ్జల రాజశేఖర్ నెన్నెల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.