
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కుమ్రం భీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు,ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మధ్య ప్రోటో కాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాకు దిగారు. రాస్తారోకోలు చేపట్టారు. అయితే కోవలక్ష్మీ అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 296(B),352(2)BNS ప్రకారం కేసు నమోదు చేశారు ఎస్సై ప్రవీణ్ కుమార్.
మరో వైపు జులై2న జడ్పీ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కల్గించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి.