భయ్యా బుక్కయ్యాడు.. బైక్ రైడర్, ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు

భయ్యా బుక్కయ్యాడు.. బైక్ రైడర్, ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి అంతో ఇంతో సంపాదిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు కాసులకు కక్కుర్తి పడుతున్నారా..? నిన్న హర్ష సాయి.. ఇవాళ భయ్యా సన్నీ యాదవ్. కేసు ఒకటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. యూట్యూబ్ లో వచ్చిన పాపులారిటీతో అడ్డదారులుతొక్కి కేసుల పాలవుతున్నారు. తాజాగా మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై సేమ్ ఇలాంటి కేసే నమోదు కావడం సంచలనంగా మారింది. 

దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించిన భయ్యా సన్నీ యాదవ్ పై సూర్యాపేట జిల్లా  నూతనకల్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది.  బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై సుమోటో గా కేసు నమోదు చేశారు నూతనకల్ పోలీసులు.  ఇంటర్నేషనల్ బైక్ రైడర్, ఇన్ ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Also Read:-హిందీకి వ్యతిరేకంలో మరో సంచలన నిర్ణయం..

తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఇప్పటి కే TGSRTC MD సజ్జనార్  మండిపడిన విషయం తెలిసిందే. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని ఆయన ఇటీవలే హెచ్చరించారు. చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.  తాజాగా భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు కావడం గమనార్హం. 

పాపులారిటీ వచ్చిన తర్వాత అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో కెరీర్ పాడు చేసుకుంటున్నారు ఇన్ ఫ్లుయెన్సర్లు. వీళ్ల ప్రమోషన్స్ చూసి కష్టపడి సంపాదించిన డబ్బును బెట్టింగ్ యాప్స్ లో పెట్టి నష్టపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.