Indian 2: ఇండియన్ 2 రిలీజ్ ఆపాలంటూ కేసు నమోదు..నా అనుమతి లేనిది వర్మ కలై ఎలా వాడారు?

Indian 2: ఇండియన్ 2 రిలీజ్ ఆపాలంటూ కేసు నమోదు..నా అనుమతి లేనిది వర్మ కలై ఎలా వాడారు?

విశ్వనటుడు కమల్ హాసన్,విలక్షణ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'భారతీయుడు 2'మూవీ గ్రాండ్‌గా జూలై 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆపేయాలని కోరుతూ కేసు నమోదైంది.'వర్మ కలై'(కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్)మధురైలోని హెచ్‌ఎంఎస్ కాలనీలో ఆసన్ రాజేంద్రన్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ కేసు పెట్టాడు.వివరాల్లోకి వెళితే..

1996లో విడుదలైన కమల్ హాసన్‌ భారతీయుడు సినిమా కోసం వర్మ కలై  శిక్షణ నేర్పినట్లుగా తనకు క్రెడిట్ దక్కిందని తెలిపారు.అయితే,భారతీయుడు 2 సినిమాలో తన మెళకువలు ఉపయోగించడానికి మాత్రం..ఇండియన్ 2 టీమ్ అతని నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అలాగే,థియేటర్లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సినిమాను నిషేధించాలని అతను కోర్టును అభ్యర్థించాడు.కాగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ ను జూలై 9న మదురై జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగింది.రాజేంద్రన్‌కు చేసిన ఫిర్యాదు కు రెస్పాన్స్ అవ్వడానికి 'ఇండియన్ 2'మేకర్స్ సమయం కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను జూలై 11కి వాయిదా వేశారు. 

ఇటీవల డైరెక్టర్ శంకర్ ప్రముఖ ఇండియాటుడే.ఇన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.."కమల్ హాసన్ తన పాత్ర కోసం ఎలాంటి హోమ్‌వర్క్ చేస్తాడో తనకు తెలియదని అన్నారు.అయితే 'ఇండియన్ 2'కోసం'వర్మ కలై'శిక్షణ కోసం ప్రకాశం గురుక్కల్‌ను సంప్రదించినట్లుశంకర్ వెల్లడించారు.కేరళ నుంచి ప్రకాశం గురుక్కల్‌ని తీసుకొచ్చి ఆయన గైడెన్స్‌ తీసుకున్నామని, వర్మ స్టైల్‌ని సినిమాలో చూడొచ్చు"అని శంకర్ చెప్పారు.ఇక రేపు జరగబోయే తదుపరి విచారణలో ఇండియన్ 2 మేకర్స్ ఎలాంటి సమాధానం చెప్పనున్నారో..కోర్టు ఎలా స్పందించి న్యాయం చేయనుందో తెలియాల్సి ఉంది. 

ప్రముఖ బడా బ్యానర్స్ లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో హీరో సిద్ధార్థ్,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవానీ శంకర్,SJ సూర్య,బాబీ సింహా,సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.