కోదాడ, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు పెట్టిన కిట్స్ కాలేజీ చైర్మన్ నీలా సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన మిల్లుకు సీఎంఆర్ కేటాయించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్ కు రికమెండ్ చేస్తూ రాసిన లెటర్ అంటూ కోదాడ లోని కిట్స్ కాలేజ్ చైర్మన్ నీలా సత్యనారాయణ ఈ నెల 3న వాట్సప్ గ్రూప్ లో ఓ పోస్ట్ పెట్టాడు.
దీనికి స్పందించిన మంత్రి ఉత్తమ్ తాను ఎవరికీ లెటర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై కోదాడకు చెందిన రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన కోదాడ పోలీసులు శనివారం సత్యనారాయణను అరెస్ట్ చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.