కొత్తగూడెం మున్సిపల్ చైర్​పర్సన్​పై కేసు

  • ఇంజినీరింగ్​ స్టూడెంట్​పై దాడి   
  • కొత్తగూడెం మున్సిపల్ చైర్​పర్సన్​పై కేసు
  • భర్త, కొడుకుపై కూడా...
  • ఈ నెల17న అబ్దుల్​కలాం కాలేజీలో ఘటన 

సుజాతనగర్, వెలుగు : అనుమతి లేకుండా ఇంజినీరింగ్​ కాలేజీలోకి ప్రవేశించడమే కాకుండా ఓ స్టూడెంట్​పై దాడి చేశారంటూ కొత్తగూడెం మున్సిపల్ చైర్​పర్సన్​తో పాటు ఆమె భర్త, కొడుకుపై కేసు నమోదైంది. సోమవారం సుజాతనగర్ పోలీసుస్టేషన్ లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆ వివరాలను తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కాలేజీలోకి ఈ నెల 17న మున్సిపల్​చైర్​పర్సన్​ కాపు సీతాలక్ష్మి, ఆమె భర్త కాపు కృష్ణ, కొడుకు నవనీత్​, మరో స్టూడెంట్​ముక్కెన వినీత్ అనుమతి లేకుండా ప్రవేశించి ఓ స్టూడెంట్​తో పాటు టీచర్ల పై దాడి చేశారు.   ప్రిన్సిపాల్ ​కంప్లయింట్ ​మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 143, 448, 323, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  సీఐ రమాకాంత్, ఎస్ఐ పండుగ తిరుపతి రావు పాల్గొన్నారు.