జీడిమెట్ల, వెలుగు : సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిపై కేసు నమోదైంది. మహిళను బ్రేన్ సమస్యతో అడ్మిట్చేస్తే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ చేసిన రోజే మహిళ చనిపోగా, వెంటిలేటర్‌పై ఉంచి తమని మభ్యపెట్టారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటమండలం సుతార్పల్లికి చెందిన చిన్నవల్లోల్ల లక్ష్మి (48) అనారోగ్య సమస్యతో ఆగస్టు 31న మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం రూ.25 వేలు తీసుకున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఆపరేష్ ప్రారంభించి, సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశారు. ఆపై10వ తేదీన కుటుంబ సభ్యులను పిలిచి, 9న ఆమెకు బ్రేన్స్ట్రోక్వచ్చిందని రూ.78 వేలు చెల్లించి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 9న బ్రేన్స్ట్రోక్వస్తే ఇప్పుడెందుకు చెప్తున్నారని బాధిత కుటుంబసభ్యులు నిలదీయడంతో కొంత వాగ్వాదం జరిగింది. అనంతరం రిపోర్టులు ఇవ్వకుండా కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని లక్ష్మిని తీసుకెళ్లడానికి అనుమతించారు. దీంతో అంబులెన్స్‌లో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో లక్ష్మి మృతి చెందింది.
దీంతో ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు. తాజాగా లక్ష్మి కుమార్తె అశ్విని సూరారం పోలీసులకు ఈ నెల 18న ఫిర్యాదు చేసింది. వైద్యులు ఆపరేషన్‌చేసిన రోజే తన తల్లి చనిపోగా వెంటిలేటర్‌పై ఉంచి తమని మభ్యపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల గాల్‌బ్లాడర్‌లో సమస్యతో వెళ్లిన మహిళకు సరైన వైద్యం అందించకుండా చంపేశారని రోగి బంధువులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.