ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, తీన్మార్​ మల్లన్నపై కేసు

కోరుట్ల, వెలుగు : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, తీన్మార్​ మల్లన్నపై పోలీసులు  కేసు నమోదు చేశారు.  జోగిన్​పల్లిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ  ధర్మపురి అర్వింద్,  గంగపుత్రులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పై , అలాగే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పై సోషల్ మీడియాలో దుర్భాషలాడినందుకు తీన్మార్ మల్లన్నపై  ఆర్ఓ రాజేశ్వర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్​కుమార్​ తెలిపారు.