కరోనా ఉన్నా బయటకొచ్చిన ఎమ్మెల్యే

కరోనా ఉన్నా బయటకొచ్చిన ఎమ్మెల్యే

పూరి: కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ, క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించి బయటకు వెళ్లిన ఒడిశా ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత్ సమంత్రయ్ కి కరోనా ఉందని, అయినా ఆయన ఆ పార్టీ లీడర్ ప్రదీప్ మహారథి అంత్యక్రియలకు వెళ్లాడని లోకల్ వ్యక్తి ఒకరు కంప్లయింట్ చేశారు. దీంతో ఉమాకాంత్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. తాను చేసిన తప్పుకు ఉమాకాంత్ సమంత్రయ్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.  మినిస్టర్ సమీర్ రంజన్ దాస్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడని కంప్లయింట్ అందినప్పటికీ పోలీసులు ఆయనపై కేసు పెట్టలేదు. మంత్రి 17 రోజుల క్వారంటైన్ పూర్తయిన తర్వాతే బయటకు వచ్చారని పూరి ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ చెప్పారు.