అధిక ధరకు విత్తనాలు అమ్మిన షాపు యజమానిపై కేసు

అధిక ధరకు విత్తనాలు అమ్మిన షాపు యజమానిపై కేసు

చేవెళ్ల, వెలుగు: అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముత్తున్న ఫెర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఏజెన్సీ ఫెర్టిలైజర్ షాపు యజమాని ఈగ లక్ష్మారెడ్డి పత్తి విత్తనాలను ప్రభుత్వధర రూ.860 లకు బదులుగా అధికంగా రూ.1200లకు అమ్ముతున్నట్టు చేవెళ్ల ఏవో తులసీకి సమాచారం అందించారు. దీంతో ఆమె రైతుల వద్ద విచారణ చేయగా అధిక ధరకు అమ్మినట్టు తేలింది. శ్రీ సాయి ఏజెన్సీపై ఏవో తులసీ కంప్లయింట్ చేయగా చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.  దర్యాప్తులో భాగంగావిచారణ చేయగా దాదాపు 120 పత్తి విత్తన ప్యాకెట్లు అధిక ధరకు రైతులకు అమ్మినట్టు బిల్లులతో పాటు ఆధారాలు లభించగా..  షాపు యజమాని ఈగ లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.