జమ్మికుంట, వెలుగు : అదనపు కట్నం కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గా కాలానికి చెందిన ఈర్ల రవళికి కొద్ది సంవత్సరాల క్రితం గోదావరిఖనికి చెందిన ప్రవేశ్ తో వివాహం జరిగింది.
పెండ్లి సమయంలో ఐదు తులాల బంగారంతో పాటు రెండు లక్షల విలువ చేసే సామగ్రిని కట్నంగా ఇచ్చారు. అయితే అదనపు కట్నం కావాలంటూ ప్రవేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రవళిని వేధింపులకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేశామని సీఐ రమేశ్ తెలిపారు.