మంత్రిపై తప్పుడు ప్రచారం నలుగురిపై కేసు

నిర్మల్, వెలుగు: రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలు, వీడియోలతో ప్రచారం చేసిన నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ బి.నరేందర్ తెలిపారు.

కందుల శ్రీకాంత్, కొండ విజ్జు గౌడ్, సాయి, బి నరేందర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మంత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.