వికారాబాద్​జిల్లాలో బ్లాక్ ​మెయిల్​ చేస్తున్న ముగ్గురు విలేకర్లపై కేసు

వికారాబాద్, వెలుగు : వికారాబాద్​జిల్లాలోని ఓ గర్నమెంట్​జూనియర్​కాలేజీలోని లెక్చరర్​ను బెదిరించి రూ.2.5 లక్షలు వసూలు చేసిన ఇద్దరు స్టూడెంట్ యూనియన్​లీడర్లు, ముగ్గురు ప్రముఖ పత్రికల రిపోర్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్ది తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ బాలికలను వేధిస్తున్నాడని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు స్టూడెంట్లతో కలిసి ధర్నా నిర్వహించారు. 

ఆ విషయం న్యూస్​చానెళ్లు, న్యూస్​పేపర్లలో రాకుండా చూడాలంటే తమకు రూ.3లక్షలు ఇవ్వాలని స్టూడెంట్​లీడర్లు దీపక్ రెడ్డి, ఇమ్రాన్, మూడు దినపత్రికల విలేకర్లు గౌస్,  ముకుంద్ రెడ్డి, లక్ష్మారెడ్డి లెక్చరర్​ను బెదిరించారు. పోలీసులు కేసు ఫైల్​చేయకుండా మ్యానేజ్​చేస్తామని నమ్మబలికారు. 

భయపడిపోయిన లెక్చరర్​ముందుగా రూ.2.5లక్షలు ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీపక్ రెడ్డి, ఇమ్రాన్​ను అరెస్ట్ చేశారు. ముగ్గురు విలేకర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదైంది.