తెలంగాణ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొన్న విషయం తెలిసిందే. అరెకపూడి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మొదలైంది. కౌశిక్‌రెడ్డి అన్న మాట ప్రకారం.. గాంధీ ఇంటికి వెళ్లకపోవడంతో.. ఆయనే తన అనుచరలను వెంటబెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. దాంతో కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది అరెకపూడి అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ఈ కేసును సుమోటోగా తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులపై BNS చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1 అరికెపూడి గాంధీతో పాటు 15 మందిఆయన అనుచరులపై సెక్షన్లు 189, 191(2), 191(3), 61,132, 329, 333, 324(4), 324(5), 351(2) red with 190 BNS కింద కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసులు పెట్టారు.