ఆదినారాయణపై దాడి చేసిన 8 మందిపై కేసు

ఆదినారాయణపై దాడి చేసిన 8 మందిపై కేసు

బెల్లంపల్లి, వెలుగు: ఆరిజన్ డెయిరీ డైరెక్టర్ కందిమల్ల ఆదినారాయణపై దాడి చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఎన్. దేవయ్య తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఆదినారాయణపై బెల్లంపల్లిలోని బజారు ఏరియాలో ఓ హెయిర్ సెలూన్ లో నిందితులు దాడికి దిగారు. వీరిలో రాగంశెట్టి సతీశ్, కొత్తపెళ్లి శ్యామ్ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు   సీఐ చెప్పారు.