
అమరావతి: సినీ నటి మాధవీలతపై అనంతపురం జిల్లాలో కేసు నమోదైంది. గతేడాది డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సెక్షన్ 353 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ తెలిపారు.
గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్రెడ్డిపై మాధవీలత హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ ఆయనపై కంప్లైంట్ ఇచ్చారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించి ఆపై ఆమెకు సారీ కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది.