బీఆర్‌‌ఎస్‌‌ ఐటీసెల్‌‌ ఇన్‌‌చార్జులపై కేసు

బీఆర్‌‌ఎస్‌‌ ఐటీసెల్‌‌ ఇన్‌‌చార్జులపై కేసు
  • కంచె గచ్చిబౌలి భూములపై ఫేక్‌‌ వీడియోలు సృష్టించారని ఫిర్యాదు

గచ్చిబౌలి, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి చెందిన ఐటీ సెల్‌‌ ఇన్‌‌చార్జులపై గచ్చిబౌలి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కంచె గచ్చిబౌలి భూములపై ఫేక్‌‌ వీడియోలు సృష్టించి, సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారని బాగన్నగారి అరుణ్‌‌కుమార్‌‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచారంతో హెచ్‌‌సీయూ స్టూడెంట్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ ఐటీ సెల్‌‌ ఇన్‌‌చార్జులు కొణతం దిలీప్‌‌, క్రిశాంక్‌‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.