జీడిమెట్ల, వెలుగు: మిలటరీ లిక్కర్ అమ్ముతున్న మాజీ సైనికుడిపై మేడ్చల్ ఎక్సైజ్పోలీసులు కేసు నమోదు చేశారు. చింతల్శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కాటమల నాగేందర్ (59) మాజీ సైనికుడు. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మిలటరీ మద్యాన్ని అమ్ముతున్న అతడిపై శనివారం దాడి చేసి, 26 ఫుల్ బాటిళ్లు సీజ్ చేశారు.