ఫేక్​ న్యూస్​ వైరల్ ​చేస్తే కేసు బుక్కే!

ఫేక్​ న్యూస్​ వైరల్ ​చేస్తే కేసు బుక్కే!

సోషల్‌‌ మీడియాపై పోలీసుల ఫోకస్

ఫేక్‌‌ పోస్టులను కనిపెట్టేందుకు పెరిగిన నిఘా

గ్రేటర్‌‌ పరిధిలో 21 మందిపై కేసులు

హైదరాబాద్‌‌, వెలుగు: లాక్‌‌డౌన్‌‌ నేపథ్యంలో ప్రజలు ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను పాటిస్తున్నారు. అయితే కొందరు సోషల్‌‌ మీడియా ద్వారా ఫేక్​వీడియోలు, ఫొటోలు పోస్ట్​చేస్తున్నారు. అసత్య, తప్పుడు ప్రచారాలతో జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ప్రజల్లో విధ్వేషాలు రెచ్చగొట్టేలా, కరోనా వ్యాధి వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తున్నారు. ఇలాంటివారి పని పట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఇష్టమొచ్చిన రాతలు 

కరోనా పాజిటివ్​కేసులు పెరగబోతున్నాయంట, అందుకే క్వారంటైన్‌‌ సెంటర్లు పెంచుతున్నారంటూ సోషల్‌‌ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరో పెట్టిన పోస్టును వాట్సాప్‌‌ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు, గ్రూపులలో షేర్‌‌ చేశారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌‌ వార్డులపైనా ఇష్టారీతిన నెగెటివ్​కామెంట్లు పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధాని, సీఎంలపై విమర్శిస్తూ పోస్ట్​చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి ఫలానా వర్గమే కారణమంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. లాక్‌‌డౌన్‌‌ కొనసాగింపు, ఎత్తివేయడం, మినహాయింపులు, వైన్‌‌ షాపులు ఓపెన్‌‌ చేయడం ఇలా వివిధ అంశాలపై సొంత అభిప్రాయాలను ప్రభుత్వాల ప్రకటనలుగా ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్‌‌ హైదరాబాద్​పరిధిలో సీసీఎస్‌‌ పోలీసులు ఇప్పటికే 21 మందిపై కేసులు నమోదు చేశారు.

సోషల్‌‌ వార్‌‌

సోషల్‌‌ మీడియా అంటేనే భిన్న వాదనలు, భావజాలాల సమూహం. ఎవరో ఒకరు పెట్టిన పోస్టుపై స్పందిస్తూ రెచ్చగొట్టే కామెంట్‌‌లు చేస్తున్నారు. వాటిని తిరిగి భిన్నమైన గ్రూపుల్లో సర్క్యులేట్‌‌ చేస్తున్నారు. గొడవకు సంబంధించిన వీడియోలను స్క్రీన్‌‌ షాట్​లు తీసి వాట్సప్‌‌ గ్రూప్‌‌లలో వైరల్‌‌ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ధోరణి పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతా బాధ్యతగా ఉండాలన్నా నెటిజన్‌‌లు పట్టించుకోవట్లేదు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు స్ప్రెడ్​చేస్తూ రెచ్చిపోతున్నారు. కొందరైతే పాత వీడియోలు, ఫొటోలను ప్రస్తుత పరిస్థితులకు లింక్​చేస్తూ వైరల్‌‌ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌‌ సీసీఎస్‌‌ పోలీసులు నిఘా పెంచారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లైట్​ తీసుకుంటే జైలుకే

ఏదైనా వాట్సాప్‌‌ గ్రూపులో, ఫేస్‌‌బుక్‌‌లో అనుచితమైన, అసత్య సమాచారం పోస్టు చేసిన వ్యక్తితోపాటు వాటిని షేర్‌‌ చేసిన వారికి కూడా సమాన శిక్ష ఉంటుంది. ఇటీవల వైన్‌‌ షాపులు ఓపెన్‌‌ చేస్తున్నట్టు ఎక్సైజ్‌‌ శాఖ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందంటూ తప్పుడు ఆర్డర్‌‌ కాపీ సృష్టించాడు ఓ యువకుడు. ఇది కాస్త సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ ఫేక్​కాపీ ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ వెళ్లగా అసలు వ్యక్తి బయటపడ్డాడు. ఈ క్రమంలో ఎవరైనా సహకరించకపోతే వారిపైనా కేసు పెట్టే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

గ్రూప్​ అడ్మిన్లదే బాధ్యత

ప్రజలు అసత్య ప్రచారం, తప్పుడు వార్తలపై అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తప్పుడు సమాచారం పంపితే హెచ్చరించాలి. అలాంటి మెసేజ్‌‌లను డిలీట్‌‌ చేయాలి. నిజం తెలుసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్‌‌ చేయొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే జైలుకు పోవాల్సి ఉంటుంది. ఏదైనా పోస్టు రాగానే పది మందికి షేర్​ చేయాలనే మానసిక ధోరణి సరికాదు. వాట్సాప్​ గ్రూపుల్లో ఏదైనా తప్పుడు ప్రచారం జరిగినట్టు తేలితే గ్రూప్‌‌ అడ్మిన్​లదే బాధ్యత. ఫేక్‌‌ న్యూస్‌‌ సర్క్యులేట్‌‌ చేస్తున్నారని సమాచారం ఇస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– కేవీఎం ప్రసాద్‌‌, సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ, హైదరాబాద్‌‌

నేరం

1  వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం

2  కరోనాపై భయం కలిగించడం

3  తప్పుడు వార్తల ప్రచారం

శిక్ష

1  సెక్షన్‌‌ 505(2), 153(A) ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష

2  సెక్షన్‌‌ 188, 269 ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష

3  డీఎంఏ యాక్ట్‌‌-2005 ప్రకారం ఏడాది జైలు శిక్ష

For More News..

దేశంలో 5,351కు చేరిన కరోనా కేసులు

23 రోజుల బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

ఈ నెల కొత్త కరెంట్ బిల్లు రాదు

వారికి కూడా 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్