- కెనడా కోర్టులో కేసు నమోదు
న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నేట్ అండర్సన్‌పై కెనడా కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. కెనడా హెడ్జ్ ఫండ్ అన్సన్ ఏం చెబితే అదే హిండెన్‌బర్గ్ పబ్లిష్ చేసిందని ది మార్కెట్ ఫ్రాడ్స్ వెబ్‌సైట్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదల చేసే ముందు అండర్సన్‌కు, అన్సన్ హెడ్ మోజ్ కస్సమ్‌కు మధ్య ఈ–మెయిల్ ద్వారా చర్చలు జరిగాయని తెలిపింది . ఈ ఇష్యూపై కెనడా ఒంటారియో కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. మార్కెట్ ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
కాగా, షార్ట్ సెల్లింగ్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్ తమ కోఆపరేషన్‌ను బయట పెట్టకుండా రిపోర్ట్స్‌పై కలిసి పనిచేస్తే అది ఫ్రాడ్ కింద పరిగణిస్తారు. హిండెన్‌బర్గ్, అన్సన్ మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణను ది మార్కెట్ ఫ్రాడ్స్ షేర్ చేసింది.
అన్సన్ ఫండ్, నేట్ అండర్సన్ చాలా సార్లు సెక్యూరిటీష్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని, ఈ ఏడాది యూఎస్ ఎస్‌ఈసీ అండర్సన్‌పై దర్యాప్తు జరుపుతుందని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. వాల్యుయేషన్ ఎక్కువయ్యిందని కెనడా రైడ్ షేరింగ్ కంపెనీ ఫేస్‌డ్రైవ్‌పై 2020 లో హిండెన్‌బర్గ్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది.
ఈ రిపోర్ట్ విడుదలయ్యే ముందు అన్సన్, అండర్సన్ ఈ–మెయిల్ ద్వారా సంప్రదించుకున్నారు. హిండెన్‌బర్గ్‌ను మూసేస్తున్నామని కిందటి వారం నేట్ అండర్సన్ ప్రకటించిన విషయం తెలిసిందే.