యాంకర్ శ్యామల భర్తపై కేసు నమోదు

బుల్లితెర యాంకర్ శ్యామల భర్త, సీరియల్ యాక్టర్ నర్సింహారెడ్డి‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు ఇవ్వవలసిన డబ్బుల గురించి అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగాడని బాధితురాలు తెలిపింది. అంతేకాకుండా నర్సింహరెడ్డి డబ్బులు తీసుకోవడంతో పాటు లైంగిక వేధింపుల కూడా పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. నర్సింహారెడ్డితో సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఓ మహిళ ఇద్దరి మధ్య రాయబారం నడిపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మధ్యవర్తిత్వం నడిపిన సదరు మహిళతో పాటు నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.