ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఎందుకంటే.. ఇవాళ మే 11, 2024న నంద్యాల నియోజకవర్గంలో తన మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని కోరుతూ నంద్యాలకు వచ్చారు. ఈ క్రమంలోనే శిల్పా రవి ఇంటికి చేరుకున్నారు. తమ అభిమాన హీరో వచ్చిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటికి వేల సంఖ్యలో వచ్చారు.
బెస్ట్ ఫ్రెండ్ కావడంతో పార్టీలకు అతీతంగా తాను రవిచంద్రరెడ్డికి మద్దతు తెలిపానని బన్నీ తెలిపారు. ఈ క్రమంలోనే పర్మిషన్ తీసుకోకుండా జనసమీకరణ చేశారని స్థానిక ఆర్వో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.