అమితాబ్, కేబీసీ యాజమాన్యంపై కేసు
ముంబై: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 12పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. షోలో అమితాబ్ బచ్చన్ అడిగిన ఓ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ లాథూర్ జిల్లా ఔసా బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యూ పవార్ కంప్లైంట్ ఇవ్వడంతో కేబీసీ షో నిర్వాహకులు, అమితాబ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం నిర్వహించిన కేబీసీ ఎపిసోడ్‌లో సోషల్ యాక్టివిస్ట్ విల్సన్, నటుడు అనూప్ సోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ వారిని ఒక క్వశ్చన్ అడిగారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 1927 డిసెంబర్ 25న ఏ గ్రంథ ప్రతులను కాల్చేశారు? అని అడిగారు. విష్ణు పురాణం, భగవద్గీత, రుగ్వేద, మనుస్మృతి ఆప్షన్స్ ఇచ్చారు. కుల వివక్ష, అస్పృశ్యతను ప్రోత్సహించేలా ఉందని మనుస్మృతిని అంబేడ్కర్ తగలబెట్టారని అమితాబ్ చెప్పారు.
For More News..