కేటీఆర్​ పై కేసు నమోదు

కేటీఆర్​ పై కేసు నమోదు

చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోలను బీఆర్ఎస్ నాయకులు మార్ఫింగ్​ చేసి సోషల్ మీడియాల్లో ఆసత్య ప్రచారం చేశారంటూ 4 రోజుల క్రితం మొయినాబాద్ మండల కాంగ్రెస్  అధ్యక్షుడు తమ్మళి మాణెయ్య మొయినాబాద్ పోలీస్ స్టేషన్​ లో ఫిర్యాదు చేశాడు. 

కేటీఆర్ సూచనలతోనే సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాల్లో వైరల్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్​తో  పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజ య్​ రావు పై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.