జగన్ పై గుంటూరులో కేసు నమోదు.. RRR కంప్లయింట్

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయ్యింది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్ పై కేసు నమోదు చేశారు గుంటూరులోని నగరపాలెం పోలీసులు. గతంలో రఘురామను సీఐడీ కస్టడీకి తీసుకొని కొట్టడమే కాకుండా హత్యాయత్నం కూడా చేసారంటూ ఫిర్యాదు చేశారు రఘురామ. ఇదే అంశంపై సీఐడీ మాజీ డీజే పీవీ సునీల్ కుమార్‌పై కూడా కేసు నమోదైంది.

రఘురామ ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ డీజీగా పనిచేశారు.తనను సీఐడీ కస్టడీకి తీసుకున్న సమయంలో దాడి చేయటమే హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌, సునీల్ కుమార్‌తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్‌, మాజీ డీఎస్పీ పాల్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read:తిరుమలలో నడుస్తూ వెళుతున్న భక్తురాలిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ..