
- ఫిర్యాదు చేసిన మెట్టు సాయికుమార్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. తెలంగాణ మత్స్య సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు మేరకు టీజీ సీఎస్‌బీ అధికారులు గురువారం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సాయికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయికుమార్ అందించిన వివరాల ఆధారాలతో సీఎస్‌బీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.