చంద్రబాబుపై హైదరాబాద్‌లో కేసు నమోదు

జైలు నుంచి విడుదలైన చంద్రబాబు, మొన్న రాజమండ్రి నుంచి ఉండవల్లి వరకు ర్యాలీగా వెళ్లారు. నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్లి.. అక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ వరకు ర్యాలీగా కదలి వెళ్లారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ర్యాలీలు, రోడ్ షో లకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబు ర్యాలీ మొదలైంది.

తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్లాన్ చేయకపోయినా అక్కడికి వచ్చిన కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకి స్వాగతం పలికే క్రమంలో హడావిడి నెలకొంది. ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడటంతో పోలీసులు కేసు పెట్టారు.

ALSO READ :- కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారింది : రాహుల్ గాంధీ