- పేట్ బషీరాబాద్ పీఎస్‌లో కేసు
జీడిమెట్ల, వెలుగు: మద్యం తాగి హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా ట్రాఫిక్ హోమ్ గార్డును బూతులు తిట్టిన బీఆర్ఎస్ నేతపై పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ట్రాఫిక్ పీఎస్‌కు చెందిన హోంగార్డు ఎ.బాల్దాస్ఆదివారం సాయంత్రం అపర్ణ గ్రీన్ స్పేస్వద్ద డ్యూటీ చేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా రాంగ్రూట్లో వస్తున్న వాహనదారుల ఫొటోలు తీస్తున్నాడు. అదే సమయంలో బైక్‌పై హెల్మెట్లేకుండా రాంగ్రూట్లో వస్తున్న కొంపల్లి 12 వార్డు కౌన్సిలర్ శిరీష భర్త, బీఆర్ఎస్ కు చెందిన నేత ప్రవీణ్‌రావు ఫొటో తీశాడు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ప్రవీణ్‘నా ఫొటోనే తీస్తావా? నేను కౌన్సిలర్‌ను’ అంటూ హోంగార్డును బూతులు తిట్టాడు.
పోలీసులు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్టెస్ట్ నిర్వహించగా, 96 ఎంజీ వచ్చింది. మద్యంసేవించి నిర్లక్ష్యంగా బండి నడపడమే కాకుండా హోంగార్డు విధులను అడ్డుకొని అసభ్య పదజాలంతో దూషించినందుకు నిందితుడిపై పేట్బషీరాబాద్పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌రావుపై గతంలో ఓ విలేకరిని బెదిరించిన కేసుతోపాటు పలు కేసులు ఉన్నట్లు సమాచారం.