వికారాబాద్, వెలుగు: గుట్కా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ఎస్ఐ స్రవంతి తెలిపిన ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ఓగులాపూర్ సమీపంలో 50 మంది బిహారీలతో హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ కరీం కోళ్లఫామ్ లో గుట్కా (గోవా) ప్యాకెట్లను తయారు చేసి మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నాడు.
సమాచారం అందడంతో మంగళవారం కోళ్ల ఫామ్ పై దాడి చేసి రూ. 60 వేల విలువైన గుట్కా మెటీరియల్ 40 కేజీలవి 20 బ్యాగులు, మిక్స్ పౌడర్ 6 కేజీలవి 6 బ్యాగ్స్, గుట్కా1000- – 50 ప్యాకెట్స్ 4 బ్యాగ్స్, 1000 ( ప్యాకింగ్ కవర్స్) , 5 బెండల్స్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడు అబ్దుల్ కరీంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ స్రవంతి తెలిపారు.