సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్‌పై కేసు నమోదు

చెన్నూర్ బీఆర్ఎస్ మాజీ  ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో మంచిర్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదు చేశారు.   బాల్క సుమన్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అంతకుముందు బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.  లేదంటే బాల్క సుమన్‌ను మంచిర్యాలలో తిరగినివ్వమని  హెచ్చరించారు.   కాగా మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్  ఘాటు వ్యాఖ్యలు చేశారు.