వికారాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ ఆఫీసర్ రాము ఫిర్యాదు తో ధారూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ క్లీనిక్ నిర్వహిస్తున్న ఐదుగురు ఆర్ఎంపీలపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ మంగళవారం తెలిపారు. గతంలో ధారూర్ మండల కేంద్రంలో మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ క్లీనిక్‌ను తనిఖీ చేసినట్లు చెప్పారు.
రూల్స్‌కు విరుద్ధంగా సొంతం ఆస్పత్రులు నిర్వహిస్తూ ఎంబీబీఎస్ డాక్టర్లలా చికిత్సలు చేస్తున్న ఐదుగురు ఆర్ఎంపీలు మీర్ ఇషాక్ అలీ, పత్తి అనిల్ కుమార్, అశోక్ కుమార్, మహమ్మద్ ఆజాం, సునీల్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.