మిర్యాలగూడ, వెలుగు : పోలింగ్ బూత్ లో ఓటింగ్ కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి ఓటు వేస్తూ ఫోటోస్ తీసుకున్న ఓ వ్యక్తి పై ప్రిసైడింగ్ అధికారి వేమారెడ్డి ఫిర్యాదు మేరకు గురువారం వేములపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఆయన తెలిపిన ప్రకారం వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో బంటు శ్రీనివాస్ పోలింగ్ బూత్ 21లోకి వచ్చి ఓటు వేసేందుకు కంపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు.
ఈ క్రమంలో తను ఓటు వేస్తూ ఫోటో తీసుకున్నట్లు అనుమానం వచ్చి మొబైల్ ను పరిశీలిస్తే...అందులో ఫోటోలు కనిపించాయన్నారు. అక్కడే డ్యూటీ చేస్తున్న లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చి అనంతరం వేములపల్లి పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.