
మియాపూర్, వెలుగు: ఫేక్సర్టిఫికెట్లతో ఓ హాస్పిటల్లో పిల్లల డాక్టర్‌గా పని చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. మియాపూర్పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 19న రాష్ట్ర మెడికల్కౌన్సిల్విజిలెన్స్ఆఫీసర్డాక్టర్విష్ణు ఆధ్వర్యంలో అధికారులు మియాపూర్మదీనాగూడలోని అంకుర హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించారు. పీడియాట్రిషియన్‌గా చేస్తున్న కలపాల భరత్‌కుమార్ సర్టిఫికెట్లు నకిలీవని, ఎలాంటి అర్హత లేకున్నా డాక్టర్ గా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. అతను డాక్టర్భైరం భరత్‌కుమార్‌కు చెందిన రిజిస్ట్రేషన్నంబర్వాడుతున్నట్లు తేల్చారు.
యాజమాన్యం సర్టిఫికెట్లు పరిశీలించకుండానే భరత్‌కుమార్‌ను జాయిన్చేసుకున్నట్లు తెలిసింది. మెడికల్‌కౌన్సిల్ రిజిస్ట్రార్ లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.