ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఏప్రిల్ 03న కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో రాధకిషన్ పై సుదర్శన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గతంలో తనను బెదిరించి తన కూతురు పేరు మీదున్న అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ను రాధాకిషన్ రావుబలవంతంగా రాయించుకున్నడని సుదర్శన్ తన ఫిర్యాదులో తెలిపారు. సుదర్శన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను ఏ4గా చేర్చారు.