ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కులం పేరుతో దూషించిన గాయకుడు ఓరగంటి శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై గాయకుడు ఓరగంటి శేఖర్ కులంపేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫేస్ బుక్ వేదికగా ఎమ్మెల్యేను అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై మానకొండూరు నియోజకవర్గానికి చెందిన ఎలుక ఆంజనేయులు అనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
రసమయి బాలకిషన్ పట్ల నిందితుడు శేఖర్ అసభ్య పదజాలంతో పాటు.. కులం పేరుతో దూషిస్తూ పోస్టులు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఓరగంటి శేఖర్ ను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.