నిజామాబాద్​ జిల్లాలో 11 మంది నకిలీ డాక్టర్లపై కేసు నమోదు

నిజామాబాద్​ జిల్లాలో 11 మంది నకిలీ డాక్టర్లపై కేసు నమోదు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో క్లినిక్​లు నడుపుతున్న 11 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశామని తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ వైస్​ చైర్మన్​ శ్రీనివాస్​ తెలిపారు. బాన్సువాడ పట్టణానికి చెందిన బొడ్డు వెంకట్​రెడ్డి, వి.సురేశ్, ఎం.ప్రకాశ్, డిచ్​పల్లికి చెందిన ఆర్. రాజశేఖర్, ఎం.వెంకటేశ్వర్, ఎస్.దత్తాత్రి, గోలి సందీప్, ఇందల్వాయికి చెందిన కానుల గంగాధర్, ముప్కాల్​ స్టేషన్​ పరిధిలో సూర మహేశ్​కుమార్, ఎం.విఠల్​సింగ్, నిజామాబాద్​ 5వ టౌన్​లో మల్లేశంపై కేసు నమోదు చేయించామని చెప్పారు. సరైన విద్యార్హతలు లేకుండా రాష్ట్రంలో క్లినిక్​లు నడిపించడంతో మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. నవంబర్​ 27న ఉమ్మడి జిల్లాలో దాడులు నిర్వహించి 11 మంది నకిలీ డాక్టర్లను గుర్తించామని తెలిపారు.